- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా (సీపీ) ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్‌ని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం నాడు నగర పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. హైదరాబాద్ సీపీగా నూతన బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ కి చిరంజీవి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీకి చిరంజీవి గారితో పాటుగా ఆయన పెద్ద కుమార్తె, ప్రముఖ నిర్మాత సుష్మిత కొణిదెల కూడా హాజరయ్యారు.
- Advertisement -