– ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి గ్రామస్థులు వినతి….
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్: భువనగిరి మండలం సూరెపల్లి – పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం, ఇంద్రియాల శివారులో మూసీనది పై నూతనంగా హై లేవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రెండు మండలాల్లోని ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. మంగళవారం ఎమ్మెల్యేను హైదరాబాదులోని ఆయన నివాసంలో భువనగిరి మండలంలోని సూరెపల్లి, ఆకుతోటబావితండా, కాండ్లకుంటతండా, పచ్చర్లబోడుతండా గ్రామ ప్రజలు, రైతులు కలిసి మాట్లాడారు.
భూదాన్ పోచంపల్లి మండలాల్లోని ఇంద్రియాల చుట్టుపక్కల గ్రామాల్లో భువనగిరి మండలంలోని పచ్చర్లబోడుతండా, సూరెపల్లి గ్రామానికి చెందిన గిరిజన రైతుల భూములు ఉన్నందున అట్టి గ్రామానికి వెళ్లాలంటే బీబినగర్ మండలంలోని భట్టుగూడెం, పెద్దరావులపల్లి మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుందని, అంతేకాకుండా సూరెపల్లి, బొల్లెపల్లి, ఆకుతోటబావితండా, కాండ్లకుంటతండా, పచ్చర్లబోడుతండా, ప్రజలు నిత్యం భూదాన్ పోచంపల్లి, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్, ఏల్బినగర్ ప్రాంతాల్లో విద్యార్థులు చదువుల కోసం ప్రయాణం చేయాలంటే ఇక్కడి నుంచి 25 కిలోమీటర్లు మాత్రమే ఉండగా చుట్టు ఇటు బీబీనగర్, భట్టుగూడెం అటు చౌటుప్పల్ మీదుగా 60 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని ఇక్కడి గిరిజన ప్రజలను దృష్టిలో పెట్టుకొని వెంటనే మూసీనది పై నూతన బ్రిడ్జిని నిర్మాణం చేపట్టాలని కోరారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ డీఈతో ఫోన్లో మాట్లాడి, బ్రిడ్జి కోసం ఎస్టిమేషన్ వివరాలతో సమర్పించాలని, బ్రిడ్జి నిర్మాణం కోసం, గ్రామ అభివృద్ధికి తోడ్పడుతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు చెవ్వల నరేష్, బానోతు నరసింహ, కెతావత్ ఉమ్లా నాయక్, ఉప సర్పంచ్ గుగులోతు తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల మహిళ అధ్యక్షురాలు పిట్టల రజిత, గ్రామస్థులు, మద్ది వెంకటనర్సిహ్మరెడ్డి, గుగులోతు లచ్చిరాం నాయక్, గుగులోతు నర్సింహ్మ నాయక్, లక్ష్మారెడ్డి, పుల్లారెడ్డి, అనంతరెడ్డి, చెవ్వల హరికృష్ణ, చముదాల రామకృష్ణ , మద్ది యుగంధర్ రెడ్డి, గులాం రసూల్, సూర్యప్రకాష్, మధుగాని మైసయ్య , మధుగాని వెంకటేష్, ఆడెపు మహేందర్, భానోత్ శంకర్, జీడిమట్ల కొండల్ రెడ్డిలు పాల్గొన్నారు.