మృతుడి కుటుంబానికి రూ 25 వేల చెక్కు అందజేత 

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ మండలంలోని కూచనపల్లి గ్రామం లో ఇటీవల తాటిచెట్టు పై నుండి పడి మృతిచెందిన మాటూరి రవీందర్ గౌడ్  అంత్యక్రియల కర్చుల కింద రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నుండి మంజూరీ అయిన రూ .25 వేల రూపాయల చెక్కును బార్య మాటూరి కళావతి కి బి సి వెల్ఫేర్ అధికారి  గంటల మల్లేశం  అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కోహెడ కొమరయ్య గౌడ్, కే.జి.కే.యస్.రాష్ట్ర కమిటీ సభ్యులు బండి కుమార్ ,రాష్ట్ర కమిటీ సభ్యులు పచ్చిమట్లరవీందర్, మండల కమిటీ నాయకులు ముంజ నారాయణ గౌడ్ కూచనపల్లి గ్రామ గౌడ సొసైటీ అధ్యక్షులు మాటూరీ సిద్ధయ్య గౌడ్, సొసైటీ డైరెక్టర్ మాజీ సర్పంచ్ బండి సుధాకర్ గౌడ్,  మాజీ సర్పంచ్ మడప జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love