పాఠశాలలలో మోగిన నగార

–  యాజమాన్య కమిటీ ఎన్నికలకు విద్యాశాఖ నోటిఫికేషన్
నవతెలంగాణ – అచ్చంపేట
ప్రభుత్వ కస్తూర్బా పాఠశాలలో  యాజమాన్యం కమిటీ ఎన్నికలను ఈనెల 29న నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలో యాజమాన్య కమిటీలు (ఎస్ఎంఎస్) ఎన్నికలు జరగనున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రాథమిక , ప్రాథమికొన్నత పాఠశాలలు,  ఉన్నత పాఠశాలలు ఎయిడ్ పాఠశాలలో కస్తూర్బా పాఠశాలలు మొత్తం 800 పైగా. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 76 వేలపై విద్యార్థులు చదువుకుంటున్నారు. 2019 నుంచి పాఠశాలల్లో యాజమాన్య కమిటీలను ఎన్నికల ప్రక్రియ తీవ్ర జాప్యం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం అమలు
 తీరు,  ఉచిత పాఠ్యపుస్తకాలు , ఉచిత యూనిఫాంల పంపిణీ , పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు యాజమాన్య కమిటీలు కీలకపాత్ర పోషించాయి. వాస్తవానికి. ఏడాదికోసారి యాజమాన్య కమిటీలో ఎన్నికలు  జరగవలసినప్పటికీ 2019 కోవిడ్ ప్రభావం కారణంగా యాజమాన్యం కమిటీలు ఎన్నికలు నిర్వహించలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు కమిటీల ను రెన్యువల్ చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యాశాఖ పైన పక్షాన ప్రారంభించింది.
 కమిటీల బాధ్యతలు : ఎన్నికైన చైర్మన్లు వైస్ చైర్మన్లు పాఠశాలలో మౌలిక వసతులపైన పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది. టాయిలెట్లు , మినరల్ వాటర్,  క్రీడా మైదానం, ఏకరూప దుస్తుల పంపిణీ, పాఠశాలలకు వచ్చిన నిర్వహణ గంట నిధులపై, మన ఊరు మనబడి ప్రణాళికలు వచ్చిన నిధులు చేసిన అభివృద్ధి పనులను,  మధ్యాహ్న భోజన అమలు తీరు పైన పర్యవేకణ చేయవలసి ఉంటుంది. ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులపైన చర్చించడం జరుగుతుంది.
యాజమాన్య కమిటీల ఎన్నిక విధి విధానాలు: ప్రభుత్వ నిర్బంధంగా ప్రచారం ప్రాథమిక పాఠశాల 10.మంది విద్యార్థుల తల్లిదండ్రులతో , ప్రాథమికొన్నన్నత పాఠశాలలో 14 మంది, ఉన్నత పాఠశాలలో 10 మంది సభ్యులతో పాఠశాల యాజమాన్య కమిటీలు ఎన్నుకోవాల్సి ఉంటుంది. కమిటీ సభ్యుల పిల్లలు ఖచ్చితంగా పాఠశాలలో చదువుతూ ఉండాలి. ఏదైనా కారణం చేత విద్యార్థులు ఇతర పాఠశాలకు వెళ్లిపోతే కమిటీలో పదవులు కోల్పోతారు.

Spread the love