పిల్లలు వచ్చేందుకు బడుల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉంచాలి

– ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
2024-25 నూతన విద్యా సంవత్సరం ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లలు ఆసక్తితో వచ్చేలా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తుగా పరిశుభ్రమైన వాతావరణం ఉంచాలని స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి స్థానిక మండల పంచాయతీ అధికారిని ఆదేశించడం జరిగిందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాఠశాల బాధ్యత తీసుకొని దగ్గర ఉండి శుభ్రం చేపించాలని చెప్పారు. పాఠశాలు ప్రారంభోత్సవం నాటి నుండి మొక్కలు లేని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆసక్తిగల పిల్లల తల్లిదండ్రులు అందరూ కలిసి మొక్కలు దశలవారీగా పెట్టేందుకు ఓ ప్రణాళిక ఏర్పాటు చేయాలని సూచించారు.
Spread the love