కలెక్టర్ అంటే ఇలా ఉండాలి.. ఆయన స్పందనకు ఓ వందనం..!

నవతెలంగాణ – తాడ్వాయి
అధికారులు అంటే కేవలం ఆదేశాలే కాదు. సామాజిక బాధ్యత అని నిరూపించారు ములుగు జిల్లా నూతన కలెక్టర్ ఆయన స్పందించిన చీరను అంతా శభాష్ అంటున్నారు.ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తాడ్వాయి మండలం సమస్య పై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. గురువారం తాడ్వాయి గ్రామ సమీపంలో లో రహదారికి అడ్డంగా చెట్టు పడిపోవడం తో ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా నేపద్యం లో ఏటూరు నాగారం నుంచి ములుగు వెళ్తున్నా జిల్లా కలెక్టర్ దివాకర టీ ఎస్  సంఘటన స్థలం వద్దకు చేరుకొని వెంటనే ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీస్ అధికారులతో ఫోన్ సంభాషించి అతి తక్కువ సమయంలో చెట్టును తొలగించేలా చర్యలు తీసుకొని రాకపోకలు ప్రారంభించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది లేకుండానే తక్కువ సమయంలోనే ప్రయాణం కొనసాగించారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Spread the love