
మండలంలోని ఉప్లూర్ శ్రీ బాల రాజేశ్వర స్వామి ఆలయానికి ఓ భక్తుడు మహాశివరాత్రి సందర్భంగా దంపతులైన అజ్ఞాత భక్తులు సుమారు 16 తులాల బంగారు నగలను విరాళంగా అందజేశారు. సుమారుగా రూ.16 లక్షల విలువైన బంగారు నగలను తయారు చేయించుకొచ్చి ఆలయ అభివృద్ధి కమిటీకి విరాళంగా అజ్ఞాత దంపతులు అందించారు. బాల రాజేశ్వర ఆలయంలోని స్వయంభు లింగానికి బంగారు తాపడం (తొడుగు) తో పాటు బంగారు నాగేంద్రుని ప్రతిమను అందజేశారు. ఈ మేరకు బాల రాజేశ్వరికి తయారు చేయించిన నగలను ఆలయ అభివృద్ధి కమిటిలకు అందజేయగా, మహాశివరాత్రి సందర్భంగా నగలను సయంబు లింగానికి అలంకరించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు బాల రాజేశ్వర స్వామి బంగారు నగలతో దర్శనమిచ్చారు. కాగా బాల రాజేశ్వరుడికి ఇంతవరకు ఎంతోమంది భక్తులు తోచిన విధంగా నగదు కానుకల రూపంలో విరాళాలు అందించారని ఇంత పెద్ద మొత్తంలో విరాళ అందించడం ఇదే మొదటిసారి అని ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తెలిపారు.