ఖుషి టాకీస్ పై నిర్మించిన ‘సీత ప్రయాణం కృష్ణతో’ సినిమా ఈనెల 14న రిలీజ్ కానుంది. రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ తదితరులు నటించిన ఈ చిత్రానికి దేవేందర్ దర్శకుడు. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెంటర్‌గా డా.రాజీవ్, డా. రోజా భారతి నిర్మించారు. సినిమా విడుదల నేపథ్యంలో హీరోయిన్ డా.రోజా భారతి మాట్లాడుతూ, ‘నన్ను నమ్మి అందరూ ఈ సినిమా నాది అని అనుకుని పని చేసారు. కాబట్టే ఇవాళ రిలీజ్ వరకు రాగలిగాం. అందరు 14న మా సినిమాని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘నాకు సినిమాలో అవకాశం ఇచ్చిన రోజా, రాజీవ్‌కి చాలా థ్యాంక్స్. వాళ్లిద్దరూ లేకపోతే ఈరోజు మేము ఇక్కడ ఇలా ఉండి మాట్లాడలేము.
కచ్చితంగా మా సినిమా అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను’ అని హీరో దినేష్ చెప్పారు. హీరోయిన్ రాఖి శర్మ మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో రాధికా అనే క్యారెక్టర్‌లో నటించాను. నాకు ఈ రోల్ చాలా స్పెషల్’ అని తెలిపారు. డా.రాజీవ్ మాట్లాడుతూ,’ఈ సినిమా మాకు చాలా సెంటిమెంట్. సినిమాలో నటించి, ప్రొడ్యూసర్‌గా డా. రోజా భారతి మాకు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది’ అని చెప్పారు. ‘మా సినిమాని అన్ని తానై మోసిన రోజా భారతికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అని డైరెక్టర్ దేవేందర్ అన్నారు.
వైవిధ్యమైన కథ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



