నల్లా కనెక్షన్లకు నేరుగా మోటర్లు పెడితే పదివేల రూపాయల జరిమానా

నవతెలంగాణ – తిరుమలగిరి
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని గృహా, వ్యాపార, వాణిజ్య యజమానులు ఎవరైనా మున్సిపాలిటీ నల్లా కనెక్షన్ లకు నేరుగా మోటార్లు పెట్టి నీటిని పట్టిన యెడల అట్టి ఇంటి నల్లా కనెక్షన్ ను శాశ్వతంగా తొలగిస్తామని, నల్ల కనెక్షన్లు శాశ్వతంగా తొలగించడంతో పాటు 10 వేల  రూపాయల జరిమానా విధించబడునని మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా  రాష్ట్ర ప్రభుత్వము 2024-2025 ఆర్ధిక సంవత్సరం ఇంటిపన్ను ఏప్రిల్ 30 లోపు చెల్లించిన వారికీ పన్ను పై 5% మినహాయింపు ఇవ్వడం జరుగుతోందని తెలియజేశారు.కావున పట్టణ ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంబంధిత బిల్ కలెక్టర్లకు గానీ లేదా కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రేత్యేక కౌంటర్లలో గానీ పన్ను చెల్లించి రశీదు పొంద గలరని,ఏప్రిల్ 30 వరకు  ప్రతి ఆదివారం కూడా కౌంటర్లు తెరచి ఉంచబడునని కమీషనర్ తెలిపారు.
Spread the love