
78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో మరి పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. ఎంపీడీవో సంతోష్ కుమార్, తహసిల్దార్ మహమ్మద్ షబ్బీర్, సీఐ నవీన్ కుమార్, ఎంఈఓ స్వామి, ఏపీఎం రవీందర్ తమ కార్యాలయాలలో జాతీయ జెండా ఎగుర వేసి జాతీయ గీతాలాపన చేశారు.అలాగే లిటిల్ ఫ్లవర్, శ్రీ సరస్వతి విద్యా మందిర్, కృషి పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండా ఎగురవేసి అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.