ఘనంగా ప్రీతం జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
హైదరాబాద్ శనివారం, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం జన్మదిన వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు దర్గాయి  హరిప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు బూడిద భాస్కర్,  యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు గోపి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి లడ్డు ప్రసాదం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సోనాయిల రఘు, బోట్ల నర్సింగరావు, చిలుకు కిష్టయ్య, సుంచు వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love