హోమ్ గార్డు కు ఘనంగా వీడ్కోలు..

A grand farewell to the home guard..నవతెలంగాణ – కంటేశ్వర్ 
నిజామాబాద్ హోమ్ గార్డ్సు విభాగంలో జులై 15న పదవి విరమణ చేయడం జరిగింది.  వి. గంగారెడ్డి, హోమ్ గార్డు నెంబర్ 83, హోమ్ గార్డు కార్యాలయం హోమ్ గార్డు శాఖలో పదవి విరమణ పొందారు. ఈ మేరకు సోమవారం వీరి పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. వీరికి శాలువలతో సత్కరించి జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, ఐ.పి.యస్ మాట్లాడుతూ.. ఎలాంటిరిమార్కు లేకుండా పదవివిరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని, డిపార్టుమెంటలు చేసిన సేవలు ఎంతోఘననీయమని పదవి విరమణ అనంతరము ఎలాంటి అవసరం వచ్చిన ఎల్లవేళల సహయపడుతామని, కుటుంభ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోళ్లు సందర్భంగా అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) శంకర్ నాయక్, రిజర్వు ఇన్స్పెక్టర్ ( హోమ్ గార్డు విభాగం ) హెచ్. సతీష్, హెడ్ కానిస్టేబుల్ గోపాల్ వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
Spread the love