- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
గత 15 నెలలుగా మద్నూర్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ నిజాయితీ నిబద్ధతతో ప్రతి ఒక్కరి మన్ననాలు పొందిన మద్నూర్ ఎస్సై విజయ్ కొండ బదిలీపై బీబీపేట్ కి వెళ్తున్నారు. ఈ సందర్భంగా పార లీగల్ వాలంటీర్ సురేష్ ఉడతావార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయనను కలిశారు. ఈ క్రమంలో ఎస్సైని మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఇలాగే మంచి మంచి పనులు చేస్తూ విధి నిర్వహణలో ఉన్నత స్థాయిని చేరాలని ఆకాంక్షించారు. అనంతరం సురేష్ ను ఎస్సై విజయ్ కొండా కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



