ఎంపీటీసీ సుధాకర్ కు ఘనంగా సన్మానం..

– అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని ఎంపీటీసీ-2  ఓపెన్ కేటగిరీలో పోటీచేసి గెలుపొంది తన 5 ఏళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్ ను మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.  గ్రామ ప్రజల మన్నాలు పొంది నిస్వార్థంగా  ప్రజలకు సేవలు అందించారని పేర్కొంటూ ఎంపీటీసీ-2 మైలారం సుధాకర్ ను మండల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా  మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి విజయ్ మాట్లాడుతూ ఎంపీటీసీగా తన 5 సంవత్సరాల  పదవికాలంలో నిజాయితీగా ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో అహర్నిశలు పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకువెళ్లిన యువ నాయకుడు మైలారం సుధాకర్ అని కొనియాడారు. రానున్న రోజుల్లో రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు పొంది, ప్రజల మన్నాలు పొందుతూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు పాలేపు నర్సయ్య, మాజీ సర్పంచ్ బక్కురి గోపి, ఉప సర్పంచ్ పాలేపు చిన్న గంగారాం, అంబేద్కర్ యువజన సంఘాల క్రియాశీల కార్యవర్గ సభ్యులు మేకల శ్రీకాంత్, కిరణ్, రాజేశ్వర్, నరేందర్, గంగాధర్, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love