దీప్తికి ఘన సన్మానం

నవతెలంగాణ- దంతాలపల్లి : మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండల కేంద్రంలోని  అక్షర హై స్కూల్లో పారాఒలింపిక్ కాంస్య పథక విజేత దీప్తి జీవంజీని ఘనంగా సన్మానించారు..వరంగల్ జిల్లాలోని కల్లెడ పాఠశాలలో చదివిన దీప్తి జీవాంజీని పార ఒలింపిక్ లో మూడవ స్థానంలో నిలిచి భారత దేశానికి కాంస్య పథకాన్ని అందించి తన దైన ముద్ర వేశారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన దీప్తి ఎంతో మంది స్టూడెంట్లకు ఆదర్శప్రాయమని,కృషి ఉంటే దేనినైనా సాధించవచ్చనని దీప్తి నిరూపంచిందని ఎంఈవో అన్నారు.ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో అనేక కష్టాలు ఎదుర్కొన్నట్లు నిష్ణాతులైన కోచ్ ల సహాయంతో తాను ప్రపంచ గుర్తింపు పొందినట్లు చెప్పారు. పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని దానిని అధిగమించడంకి ఎన్ని అడంకులు ఎదురొచ్చిన అధిగమించాలన్నారు. కార్యక్రమంలో అక్షర స్కూల్ ప్రిన్స్ పాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
Spread the love