కాసర్లగడ్డలో కళాకారుల బృందం అవగాహన..

నవతెలంగాణ – ముత్తారం
ముత్తారం మండలం కాసర్లగడ్డలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం సభ్యులచే బడి బా టపై మంగళవారం అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫారంలు, ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన, మధ్యాహ్నం భోజనం లాంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని, తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పాటల రూపంలో అవగాహన క ల్పించారు. అదేవిధంగా యువత చెడు మార్గం పట్టకుండా సన్మార్గంలో నడవాలని, నేటి యువత  దేశ భవిత అని యువతరం గ్రహించాలని, తల్లిదండ్రులు కన్న కలలు నిజం చేయాలని పాటల రూపంలో అవగాహన కల్పించారు. వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారథి కళాకారులు కోండ్ర వెంకన్న గౌడ్, ఇల్లoదుల మల్లేష్ గౌడ్, జనగామ రాజనర్సు, ఈదునూరి పద్మ, బుర్ర శంకర్ గౌడ్, సలేంద్ర రాజన్న, జిన్న రమ, కన్నూరి రేణుక, దీకొండ శ్రావణ్, కట్కూరి శ్రీవల్లి తదితరులున్నారు.
Spread the love