సహచర విద్యార్థి కుటుంబానికి స్నేహితుల చేయూత 

– రూ.50 వేల డిపాజిట్ పత్రమందజేత 
నవతెలంగాణ – బెజ్జంకి 
తమతో విద్యనభ్యసించి ఆకస్మికంగా మృతిచెందిన సహచర విద్యార్థి కుటుంబానికి చేయూతగా నిలిచి ఔదార్యం చాటారు తోటి స్నేహితులు. మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామానికి చెందిన జేరిపోతుల శంకర్ బాబు మండల కేంద్రంలోని 1998-99 విద్యాసంవత్సరంలో విద్యనభ్యసించాడు. అయనకు ఇద్దరు కూతుర్లు సంతానం. ఇటీవల ఆకస్మికంగా శంకర్ బాబు మృతిచెందడంతో మృతుని కుటుంబానికి తోటి స్నేహితులు చేయూతనందించారు. మృతుని ఇద్దరు కూతుర్ల భవిష్యత్తు కోసం సుమారు రూ.50 వేలు నగదును పోస్టాఫీసు కార్యాలయంలో ఫిక్సెడ్ డిపాజిట్ చేసి మృతుని బార్యకు అదివారం పత్రమందజేశారు. బొమ్మిడి లక్ష్మణ్,జెట్టి శ్రీనివాస్, జక్కని శ్రీనివాస్,కముతం శ్రీను,అన్నల్దాస్ మల్లేశం,బూర్గుల రాజు,వడ్డేపల్లి ప్రసాద్ పాల్గొన్నారు.
Spread the love