
ఎస్ హెచ్ ఓ గా ఏ మహేందర్ బుధవారం తన పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు తమ సిబ్బందితో అనునిత్యం ధర్మసాగర్ స్టేషన్ పరిధిలోని మండల ప్రజలకు అండగా ఉంటానని అన్నారు. మండల ప్రజలు సైబర్ క్రైమ్ నేరాలకు ఏటువంటి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. యువత మత్తు వదిలి, ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించి, ఉన్నత శిఖరాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.