ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

Man commits suicide by hangingనవతెలంగాణ –  కుబీర్
మండలంలోని పార్డి (బి) గ్రామానికి చెందిన పోనికంటి సాయినాథ్ (46) అనే వ్యక్తి శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలపిన వివరాల ప్రకారం పోనికంటి సాయినాథ్ కూతురు గత 15రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి మద్యం తాగుతుండేవాడు. ఈక్రమంలో గురువారం రాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. వెళ్లి తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం సమయంలో వ్యవసాయ క్షేత్రానికి చుట్టూ ప్రక్కల వారు వెళ్లడంతో సాయినాథ్ కౌలుకు చేసిన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వేప చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఇది చూసిన వారు కుటుంబ సభ్యులకు, పోలిసులకు సమాచారం అందించడం జరిగింది. దింతో సాయినాథ్ కూతురు ఇంటి నుంచి వెళుపోవడంతో మనస్తపం చెంది జీవితం మీద విరక్తి చెంది ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని తెలిపారు. మృతుడి కుమారుడు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ రవీందర్ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.

Spread the love