ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య..

Man commits suicide by hanging himself..– ఇద్దరిపై కేసు నమోదు 
నవతెలంగాణ – తాడ్వాయి
ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కాటాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన కంపెల్లి దేవేందర్ (40) గత పది సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇద్దరు కుమారులు ఉన్నారు. గత ఆరు రోజుల క్రితం 10వ తారీకు నాడు ఇంటికి వచ్చాడు. మంగళవారం రాత్రి సుమారు పదిన్నర గంటల ప్రాంతంలో ఇంటి వెనుక ఉన్న ఇంటిలో చీరతో మెడకు ఉరేసుకొని మృతి చెందాడు. కాగా మృతుడి సెల్లులో రామెల్ల ప్రశాంత్, రామెల్ల నరసయ్య లు నా చావుకు కారణమని వాయిస్ రికార్డింగ్ లభించింది. దాని ఆధారంగా కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై వివరించారు. తల్లి కంపెల్లి కన్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు
Spread the love