వ్యవసాయ మార్కెట్లో  రూ.5.రూపాయల భోజనం అమలు చేయాలి

– రైతులు, కార్మికులు, కూలీలకు ఆకలి తీరుతుంది
నవతెలంగాణ – అచ్చంపేట 
నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం లో రైతులు , వ్యవసాయ కూలీలు అధిక శాతం నివాస ఉంటున్నారు. నూటికి ఎనభై శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తారు. రైతులు, వ్యవసాయ కూలీలను దృష్టిలో పెట్టుకొని అచ్చంపేట పట్టణంలో వ్యవసాయ మార్కెట్  ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 8 మండలాలు 120 పైగా గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఏజెన్సీ పల్లెలు గిరిజన తండాలు చెంచుపెంటలు అధికంగా ఉన్నాయి. మండల కేంద్రానికి 100 కిలోమీటర్ల పైగా గ్రామాలు విస్తరించి ఉన్నాయి.  ఆయా గ్రామాలలో రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కు తీసుకొస్తారు. పంటలను అమ్ముకోవడానికి వచ్చిన రైతులు ఒకటి రెండు రోజులు మార్కెట్ ఆవరణలోనే ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి. మూడు పూటలా భోజనానికి రైతులు ,వ్యవసాయ కూలీలు , హమాలీ కార్మికులు చాటకూలీలు హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు రూపాయల భోజనం అమలు చేస్తే వేలాది రైతులకు ,కార్మికులకు హామాలి కార్మికులకు , చాటకూలీలకు,  ఆకలి తీరుతుంది. వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ శాఖ అధికారులు, మునిసిపాలిటీ శాఖ అధికారులు సమన్వయంతో ఆలోచించి మార్కెట్ యార్డులో కనీసం మధ్యాహ్నం భోజనం అయిదు రూపాయలకే అమలు చేయవలసిన బాధ్యత అధికారుల పైన ఉంది. గత టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులలో సద్ది ముట పథకం కింద ఐదు రూపాయలకే భోజనం అందించారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మార్కెట్ యార్డ్ లో భోజనం కొనసాగిస్తామని ప్రారంభించారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో  భోజన పథకం నిలిచిపోయింది. జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వారి సహకారంతో ఐదు రూపాయల భోజనం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఐదు రూపాయల భోజనం అమలు చేస్తే బాగుంటుందని రైతులు కార్మికులు కోరుతున్నారు. ప్రస్తుతం రైతులు వేరుశనగ పంటను మార్కెట్ కు తీసుకొస్తున్నారు. వచ్చేనెల చివరి వరకు రైతులతో వేరుశనగ పంటలతో రద్దీగా ఉంటుంది ఇప్పుడు ఐదు రూపాయలు పథకం అమలు చేస్తే వేలాది మంది రైతులకు వ్యవసాయ కూలీలకు ప్రయోజనం కలుగుతుంది.
ఐదు రూపాయల భోజనం ఏర్పాటు చేయాలి :  కాట్రావత్ పాండు , హమాలీ మార్కెట్ యార్డ్ అచ్చంపేట. మార్కెట్ యార్డులో ఐదు రూపాయలకు మధ్యాహ్నం భోజనం అమలు చేయాలి. రైతులకు హమాలీ కార్మికులకు,  చాటకూలీలకు, వ్యవసాయ కూలీలకు ప్రయోజనం కలుగుతుంది. గత ఏడాది మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నెల రోజులపాటు అమలు చేశారు. అందరికీ చాలా ఉపయోగపడింది.

Spread the love