Thursday, June 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలిపే సినిమా

తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలిపే సినిమా

- Advertisement -

దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్‌గా మురళీధర్ గౌడ్, సుధ టైటిల్ పాత్రలలో నటిస్తున్న సినిమా ‘వెంకట్రామయ్య గారి తాలూకా. సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత కోమలి మాట్లాడుతూ, 'ఫోక్ సింగర్ గా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. సినిమా రంగం మీద నాకున్న ఇష్టంతో సినిమా తీయాలనే లక్ష్యంతో, చాలా ఒడుదుడుకులని ఎదుర్కొని ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు నేను పడిన కష్టం, పడిన మాటలు కంటినిండా నిద్ర కూడా పట్టేది కాదు. అన్ని కష్టాలు ఎదుర్కొని ఈ సినిమాని నిర్మించాను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా మా సినిమా ఉంటుంది. జులైలో మూవీ విడుదల చేయటానికి రెడీ చేస్తున్నాం. ఓ మంచి సినిమా తీసినందుకు నిర్మాతగా గర్వంగా ఉంది అని తెలిపారు. ‘మా సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. త్వరలోనే డేట్ ఫైనల్ చేసి అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాం.

అందమైన ఒక పల్లెటూరులో వెంకట్రామయ్య అనే పరువుగల కుటుంబం లో జరిగే కథ. ప్రస్తుతం మనుషుల మధ్య ఉన్న బంధాలు డబ్బుతో ముడిపడ్డాయి. మానవీయ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలు గా మారిపోయాయి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కడుపు కట్టుకుని ఎన్నో కష్టాలను భరిస్తూ పిల్లలను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి, పెద్ద చేస్తున్నారు. కానీ తల్లిదండ్రుల చివరి దశలో ఆ పిల్లలందరూ కలిసి వాళ్ళని పెంచలేకపోతున్నారు. తల్లి దండ్రుల గొప్పతనం తెలియచేసే సినిమా. ఈ మంచి ఫ్యామిలీ డ్రామాని ఫ్యామిలీతో కలిసి సినిమా హాలుకి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేసేలా తెరకెక్కించాం` అని దర్శకుడు సతీష్ ఆవాల అన్నారు. దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్,మురళీధర్ గౌడ్, సుధ, కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూముంజెటి, హాసిని,యామిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డాన్స్: సాగర్ మాస్టర్, మ్యూజిక్: చరణ్ అర్జున్, కెమెరామెన్: బి. అనిల్ కుమార్, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు: కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: సతీషడాన్స్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -