
డిచ్ పల్లి మండల కేంద్రంలోని నడిపల్లి,కోరట్ పల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రలలో శనివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నడిపల్లి గ్రామ పంచాయతీ గ్రేడ్ వన్ కార్యదర్శి నిట్టు కిషన్ రావు,అంగన్వాడి టిచర్లు పాల్గొని మాట్లాడుతూ గర్భవతులు, తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రు పాలు ఇవ్వాలని, మొదటగా వచ్చే ముర్రు పాలలో వ్యాది నిరోదక శక్తి ఉంటుందని వివరించారు.బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లికి, బిడ్డకు అనుబందం పేరుగుతుందని,6 నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నారు.ఇదే కాకుండా బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లికి రక్తస్రావం తగ్గుతుందని, గర్ఘ సంచి యదస్థితికి వస్తుందని తెలిపారు. రోమ్ము కాన్సర్ రాకుండా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో గర్భిణీలు, బాలింతలు, తల్లులు, అంగన్ వాడీ సిబ్బంది వి. సుశీల, టి భాగ్యలక్ష్మి, అమినా బేగం, ఖతీజ, ఆరోగ్య సిబ్బంది. డాక్టర్, వినిత్, ఎఎన్ ఎం సుజాత, అంగన్వాడీ కార్యకర్తలు,అశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.