చేనేతల సమస్యలు పరిష్కరించాలని  తహసిల్దార్ ద్వారా ప్రభుత్వానికి వినతి

నవతెలంగాణ – చండూరు 
చేనేతల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు చేనేత కార్మికులు,పద్మశాలి పెద్దలు చేనేత పరిరక్షణ సేవా సమితి (సిపిఎస్)అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు, పద్మశాలి కుల పెద్దల ఆధ్వర్యంలో సోమవారం చండూరు తహసిల్దార్ దశరథ  ను కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ  సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ..చేనేత త్రిఫ్ట్ ఫండ్, చేనేత మిత్ర తో పాటు ఇతర అన్ని పథకాలను కొనసాగించాలని, అదనంగా పథకాలను అమలు చేయాలని కోరారు.అలాగే పని భరోసా కలిపించాలన్నారు. త్రిఫ్ట్ ఫండ్ కు సంబంధించి  అవసరమైతే కాలపరిమితి మేరకు ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి తక్షణమే డబ్బులు విడుదల చేయాలని కోరారు. పని భరోసా కల్పించేందుకు ప్రింటెడ్ చీరలను అరికట్టడంతో పాటు చేనేత సంఘాలను బలోపేతం చేసి చేనేత చీరలను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. 60 ఏళ్లు దాటిన వారికి  కార్పొరేషన్ ద్వారా 5 లక్షల జీవిత బీమా  తక్షణమే వచ్చేలా చూడాలన్నారు. బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని, క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలని, పిల్లల ఉన్నత చదువులకు  ఆర్థిక సాయం అందించాలని  పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుర్రం బిక్షమయ్య, గౌరవ అధ్యక్షుడు పులిపాటి ప్రసన్న, ట్రస్ట్ చైర్మన్ కోమటి వీరేశం, రావిరాల శ్రీను, చేనేత పరిరక్షణ సేవా సమితి కార్యవర్గం,కార్మికులు  కర్నాటి శ్రీనివాసులు,  రాపోలు వెంకటేశం,ఎలె శ్రీను, సంగెపు శ్రీను, చెరుపల్లి కృష్ణ, రాపోలు జగదీశ్వర్, చెరుపల్లి వెంకటేశం,  రావిరాల సన్నీ,  రాఘవేంద్ర, చెరుపల్లి శ్రీను, బొల్ల వెంకటేశం, గానుగు వెంకటేశం, చెరుపల్లి రాజు, కర్నాటి నగేష్, గజం రాజు, రావిరాల వెంకటేశం, కోడి కృష్ణ, రాపోలు ప్రభాకర్,సుమన్, ముషం రాములు,  ముషం యాదగిరి, జానకిరాములు,మార్కండేయ,బిక్షమయ్య,  వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
Spread the love