రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో స్వల్పంగా నీటి ప్రవాహం పెరిగింది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల ఆదేశాల మేరకు శనివారం ఒక్కరోజు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టుని గేట్లను తెరవడంతో నీటి ప్రవాహం స్వల్పంగా పెరిగింది. కందకుర్తి గోదావరి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కందకుర్తి గోదావరి ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నుంచి వచ్చే మీరు నేరుగా ఎస్ఆర్ఎస్పీ లోకి వెళ్తుండడంతో స్వల్పంగా గోదావరిలో నీరు వచ్చి చేరింది.