నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీతారామ కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ సీ.పీ.రాధాకష్ణన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశం, రాష్ట్రం ప్రగతిని సాధించాలనీ, ప్రతి ఒక్కరికీ శుభం కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సతీమణి శ్రీమతి సుమతి రాధాకృష్ణన్, గవర్నర్ ముఖ్య కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.