
మండలంలోని సిద్దరామేశ్వరనగర్ గ్రామానికి చెందిన అకుల్ జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యాడు. ఆదివారం కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటిల్లో అండర్-12 విభాగంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ చూపి జాతీయ స్థాయి కి ఎంపికైనట్లు కోచ్ ప్రతాప్ దాస్ తెలిపారు. గత 2 సంవత్సరాలుగా అకుల్ దోమకొండ గడికోటలో కోచ్ ప్రతాప్ దాస్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాడు. జాతీయస్థాయి కి అకుల్ ఎంపిక అవ్వడం పట్ల మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రథమ ప్రతిభ కనబరిచి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.