– కెవిపిఎస్ జిల్లా నాయకులు చింతల నాగరాజు
నవతెలంగాణ – ఉప్పునుంతల
మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో శనివారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్, అంబేద్కర్ యువజన సంఘం ల ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గం, ఉప్పునుంతల మండల స్థాయిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు పూలే జన జాతర ను ప్రతి ఏడాది మాదిరిగానే ఏప్రిల్ మాసాన్ని మహనీయుల మాసంగా ప్రకటించుకుని మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన జాతరలు నిర్వహించడం జరుగుతుందని కెవిపిఎస్ జిల్లా నాయకులు చింతల నాగరాజు అన్నారు, మండల నాయకులు పాతుకుల కొండలు, మేకల శేఖర్, బొడ్డుపల్లి ప్రసాద్, మాగాని ప్రశాంత్, కంచె హుస్సేన్, ప్రకాష్ లు మాట్లాడుతూ.. జన జాతర సభలు నిర్వహించి కుల వివక్ష అంటరానితనం అధ్యయనం చేసి కుల వివక్ష రూపంపై ప్రత్యక్ష ప్రతిఘటన కార్యక్రమాన్ని రూపొందిస్తామని తెలిపారు. దళితుల ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేస్తామన్నారు. ఈ పోరాటంలో కెవిపిఎస్ నాయకత్వం అగ్రభాగాన నిలబడాలి అన్నారు. గ్రామాలలో కుల వివక్షాలు ఉంటే స్థానిక ఎస్సై, తహసిల్దార్ కు పిర్యాదు చేస్తామన్నారు. మండలంలో అన్ని గ్రామాలలో సామాజిక చైతన్య యాత్రలు ఏప్రిల్ మాసం మహనీయుల మాసం సందర్భంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కార్యకర్తలు సైదులు, అనిల్, గణేష్, శ్రీశైలం, ఆనంద్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.