
విద్యార్థులకు విజ్ఞానం అందించాలంటే ఉపాధ్యాయులు నిరంతరం జ్ఞానం నేర్చుకోవాలని మండల విద్యాశాఖ అధికారి బండి నర్సమ్మ అన్నారు.మంగళవారం
దౌల్తాబాద్ మండలం ఇందు ప్రియాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి ఎందుకంటే విద్యార్థులకు జ్ఞాన సంపద అందించాలంటే ఉపాధ్యాయుడు నిరంతరము నేర్చుకుని విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలని సూచించారు. కాంప్లెక్స్ సమావేశంలో నేర్చుకున్నటువంటి తరగతి గది నిర్వహణ బోధనోపకరణముల నిర్వహణ వినూత్న బోధనలు తరగతి గదిలో కూడా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. వీటితోపాటు యుడైస్ పాఠశాల సమగ్ర సమాచారం, ఫేషియల్ అటెండెన్స్,అదేవింగా మధ్యాహ్న భోజన నిర్వహణ విధానం ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ విధులు నిర్వహించాలని సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అఫ్జల్ హుస్సేన్, రిసోర్స్ పర్సన్ త్యాగరాజు, శ్రీనివాస్ సీఆర్పీలు చంద్రమౌళి, రాజు, నగేష్, ఎమ్మార్సీ సిబ్బంది పెంటయ్య,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.