రేపు పోలవరం ప్రాజెక్టు వద్దకు అంతర్జాతీయ నిపుణుల బృందం

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై నిన్న శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రాజెక్టు పురోగతి దిశగా కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. రేపు (జూన్ 30) పోలవరం ప్రాజెక్టు వద్దకు అంతర్జాతీయ నిపుణుల బృందం రానుంది. ఈ బృందం పోలవరం ప్రాజెక్టును నాలుగు రోజుల పాటు నిశితంగా పరిశీలించనుంది. కాఫర్ డ్యామ్ లు, డయాఫ్రమ్ వాల్ ప్రస్తుత పరిస్థితిని ఈ బృందం అంచనా వేయనుంది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఈ అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

Spread the love