స్వతంత్ర సమరయోధునికి సన్మానం

A tribute to a freedom fighterనవతెలంగాణ – ఆర్మూర్  

పట్టణంలోని జర్నలిస్ట్ కాలోని లోని  పట్టణానికి చెందిన  క్షత్రియ స్వాతంత్ర సమరయోధుడు డిజే.శివాదాస్ 94 వ జన్మదినాన్ని వారి కుటుంబ సభ్యులు ఆదివారం ఘనంగా స్వగృహంలో నిర్వహించడం జరిగిందని వారి కుటుంబ సభ్యులు కొడుకు డిజే దయానంద్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్ష్ మాజీ అధ్యక్షలు, మనుమడు లయన్ నివేదన్ గుజరాతి లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ గ్రీన్ చార్టర్  ప్రెసిడెంట్ లయన్ లు తెలిపినారు అనంతరం జన్మదినం జరుపుకుంటున్న శివదాస్ మాట్లాడుతూ ఇట్టి జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నాకు చాలా ఆనందం,  ఉత్సాహం, లభించిందని తద్వారా మరింత అయూశు పెరిగిందని వారు కొనియాడారు సమాజంలో ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉండాలని పిలుపినిచ్చారు ఇట్టి కార్యక్రమంలో కుటుంబ సభ్యులు డీజే లత, గుజరాతి గీత, ప్రశాంతి, వినంతి,డిజె సులోచన, డిజె ప్రేమ్ నాథ్, ఉమా, మీరాబాయి, నిర్మల, మమత, జ్యోతి, స్వాతి, హీరాబాయి, శాంతి నిహారిక,వికాస్ జైనంద్,సాయి ఆవేదన్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love