
మండలంలోని కాటెపల్లి గ్రామానికి చెందిన అబ్బన్ బోయిన విజయ్ కుమార్ గురుకుల టీచర్ గా ప్రభుత్వ ఉద్యోగం సాధించినందుకు ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం శాలువా కప్పి ఘనంగా సన్మానించి అందరికీ స్వీట్లు తినిపించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మల్లప్ప పటేల్ మాట్లాడుతు విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ యువనేతగా పార్టీకి సేవలు అందించారని తెలిపారు.అలాగే అనేక సేవాకార్యక్రమాలు చేపట్టి గ్రామంలో అందరి మన్ననలు పొందారని అన్నారు. విద్యార్థులకు కూడా సేవలు అందించి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మొహిద్దిన్ పటేల్,సింగిల్ విండో డైరెక్టర్లు గంగాగౌడ్, పెంటన్న,నాయకులు మొగులా గౌడ్, హన్మాండ్లు, సాయులు,షేక్ చాంద్ పాషా,ఇస్మాయిల్ పటేల్, చోటు పటేల్,హాజి,శంకర్, బందిగి పర్వయ్య, నీరుడి అశోక్,గంగారాం తదితరులు పాల్గొన్నారు.