- Advertisement -
నవతెలంగాణ-చిన్నకోడూరు
మండల పరిధిలోని మాచాపూర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 2014-15 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి విద్యార్థులు ఒక చోట కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. తరగతి గదిలోని అల్లరి వేశాలు, అనుభవాలను పంచుకున్నారు. ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు. రోజంతా ఆట పాటలతో సరదాగా గడిపారు.
- Advertisement -



