Tuesday, May 12, 2026
E-PAPER
Homeజాతీయంభార్యకు గౌరవంగాజీవించే హక్కుంది

భార్యకు గౌరవంగాజీవించే హక్కుంది

- Advertisement -

ఆమెను పశువులా చూడొద్దు
గృహహింస కేసులో సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు


న్యూఢిల్లీ : భార్యను పశువులా చూడకూడదని, ఆమెకు గౌరవంతో జీవించే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గృహహింస కేసు విచారణలో భాగంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గృహహింస ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. నిందితుడు మద్యం మత్తులో ఆ మహిళపై దాడి చేశాడని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. నేలపైకి తోయడంతో ఇటుక తగిలి ఆమె తలకు బలంగా గాయమైనట్టు, ఆ తర్వాత కర్రతో కూడా దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి. మరోవైపు నిందితుడు మూడు వివాహాలు చేసుకోగా.. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధితురాలైన మొదటి భార్య వాదనలు విన్న న్యాయస్థానం.. “మీరు మీ భార్యను ఎందుకు కొట్టాలనుకున్నారు..? ఇలాగే వేధిస్తే.. ఆమె మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది. రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి” అంటూ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -