నవతెలంగాణ-కుల్కచర్ల
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నవాబ్‌పెట్ మండలం కిషన్ గూడా గ్రామానికి చెందిన మల్లేష్ (26) బుధవారం మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో తన స్నేహితులతో కలిసి తాటికల్లుతో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ ముగిసిన అనంతరం సొంత గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ఇప్పాయిపల్లి రోడ్డు సమీపంలోనే ఉన్న కరెంటు స్తంభానికి ఢీకొని కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు కుల్కచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.