– మంటలు అర్పిన పైర్ సిబ్బంది
నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని నాచారం గ్రామానికి చెందిన బంక శ్రీనివాస్,రమేష్ అనే రైతులకు సంబంధించిన జామాయిల్ తోట ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన శుక్రవారం రాత్రి.చోటుచేసుకుంది.స్థానికుల,బాధిత రైతుల పూర్తి కథనం ప్రకారం శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు జామాయిల్ తోటలో నుంచి భారీగా పొగ చుట్టిముట్టి, మంటలు చెలరేగాయని తెలిపారు.వెంటనే భూపాలపల్లి అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో పైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నట్లుగా తెలిపారు.అగ్ని ప్రమాదంలో 10 గుంటలు జమాయిల్ తోట,డ్రిప్ నాలుగు పైపులు,తోట చుట్టూ వేసిన కట్టెల కంచె అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. ఆర్థికంగా బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.