Wednesday, July 1, 2026
E-PAPER
Homeజాతీయంరామారావు హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి: బృందా కారత్

రామారావు హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి: బృందా కారత్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కామ్రేడ్ రామారావు హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఐ(ఎం)‌ సీనియర్ నాయకురాలు బృందా కారత్ డిమాండ్ చేశారు. ఈ కేసులో ఎనిమిది నెలలు గడిచినా ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయకపోవడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి నిదర్శనమని ఆమె విమర్శించారు. సీపీఐ(ఎం) మధిర డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుసంఘం నాయకులు సామినేని రామారావు విగ్రహావిష్కరణ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బృందా కారత్ మాట్లాడుతూ
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

న్యాయం కోసం ప్రజలు సంఘటితంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. అక్టోబర్ 31న సీపీఐ (ఎం) సీనియర్ నాయకులు సామినేని రామారావు హత్యకు గురయ్యారని గుర్తుచేసిన ఆమె, ఎనిమిది నెలలు గడిచినా దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల భద్రత, న్యాయం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అధికారంలో ఉన్నవారు బాధ్యత నుంచి తప్పించుకోలేరని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాలంటే ఈ కేసులో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని బృందా కారత్ స్పష్టం చేశారు. సీపీఐ (ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాల్ రావు అధ్యక్షతన జరుగుతున్న సభలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -