నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి..

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 

నర్సింగ్ విద్యార్ధిణుల భవిష్యత్తుతో చెలగాట మాడుతున్న నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకొని విద్యార్థిణులకు న్యాయం చేయాలని హై కోర్టు అడ్వకేట్, బీఆర్ఎస్ నాయకులు ఎం వెంకటేశ్ (గుణ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కోఠిలోని తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ కార్యాలయం ముందు నర్సింగ్ విద్యార్ధిణు లతో కలిసి ఆయన నిరసన తెలిపారు. అనం తరం ఆయన మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరానికి గాను మెహిదీపట్నం లోని నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో 35 మం ది విద్యార్ధిణులకు అడ్మిషన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. కాగా ఆ కళాశాలలో ప్రిన్సిపాల్ తప్ప మరే అధ్యాపకులు, సిబ్బంది కానీ లేకపోవడం గమన్హారమని అన్నారు. వన్ ఉమెన్ ఆర్మీగా కొనసా గుతున్న ప్రిన్సిపాల్ మానస ఒక్క రోజు కానీ ఒక్క క్లాసు కానీ నర్సింగ్ విద్యార్ధిణులకు భోధించిన పాపాన పోలేదని ఆయన మండిపడ్డారు. 35 మంది విద్యార్థులను చేర్చుకున్న కళాశాలలో ఒక ఫ్యాకల్టీ, సిబ్బంది లేక పోవడం ఆశ్చ ర్యానికి గురి చేస్తుందని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆలస్యంగా అర్ధం చేసుకున్న విద్యార్థిణులు గత రెండు నెలలుగా తెలంగాణ నర్సింగ్ కౌ న్సిల్ అధికా రులకు ఫిర్యాదు చేసినా కాళ్ళు అరిగేలా తిరిగినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తనను ఎవరూ ఏమి చేయలేరని విద్యార్ధిణులను బెదిరిస్తుండటంతో చేసేది లేక విద్యార్థిణులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో కళాశాల ప్రిన్సిపాల్కు కౌన్సిల్కు హాజరు కావాలని నోటీసులను ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరో పించారు. కళాశాల ప్రిన్సిపాల్ను ఎన్ని సార్లు కౌన్సిల్కి రావాలని పిలిచినా రావట్లేదు అని కౌన్సిల్ అధికారులు తెలుపుతుండటం శోచనీయమని అన్నారు. కౌన్సిల్ అధికారుల వైఖరి చూస్తుంటూ నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ తో లోపాయి ఒప్పందకారం ఉన్నట్లు విద్యార్థిణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన ఆరు నెలల నుండి విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని అన్నారు. ఇప్ప టికైనా రాష్ట్ర వైద్య ఆర్యోగ శాఖ మంత్రి, ప్రభు త్వం విద్యార్ధిణుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నర్సింగ్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని విద్యార్థిణులకు న్యా యం చేయాలని డిమాండ్ చేశారు.

Spread the love