ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

Action should be taken against the person who cheated by promising to provide house plots.– రూరల్ ఎమ్మెల్యే కు వినతి
నవతెలంగాణ-  కంఠేశ్వర్
ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కు మంగళవారం కలిసి విన్నవించారు. స్పందించిన రూరల్ ఎమ్మెల్యే నిజామాబాద్ ఏసీపి కలిసి ఫిర్యాదు చేయాలని తెలిపినట్లు బాధితులు తెలిపారు. ఈ సందర్భంగా ఇల్లు లేని నిరుపేదలు, బాధితులు మాట్లాడుతూ.. తమకు ఇండ్ల స్థలాలు కల్పిస్తామని చిలుక శ్రీనివాస్ అనే వ్యక్తి తమకు ఇండ్ల స్థలాలు చూపించ లేదు. సుమారు 19 మంది వద్ద చిలుక శ్రీనివాస్ డబ్బులు తీసుకుని మోసం చేసినాడు, మెత్తం డబ్బులు 1,50,000/- చిలుక శ్రీనివాస్కు ఇవ్వడం జరిగిందన్నారు.. తమను మోసం చేసిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని కలిసిన అనంతరం నిజామాబాద్ ఏసీపీ కి కలిసి ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. ఎమ్మెల్యేని కలిసి వినతిపత్రం సమర్పించిన వారిలో 19మంది బాధితులు ఉన్నారు.

Spread the love