నక్షబాట ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి

– రైతులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు 
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం కాచారం సోమవారం, రైతులు వైద్యుల తిరుపతి, వైద్యుల ప్రకాష్, వైద్యుల కవిత, వైద్యుల నారాయణ, ఏర్ల భాస్కర్ రెడ్డి, ఏర్ల సంతోష్ రెడ్డిలు, తెలిపిన వివరాల ప్రకారం ఆలేరు నుండి రఘునాథపురం వెళ్లే దారిలో కాచారం రెవిన్యూ పరిధిలో సర్వేనెంబర్ 136,  142 మధ్యలో నుండి నక్షబాట ఉన్నది. సుమారు 15 మంది రైతులకు ఈ నక్ష భాట ద్వారానే పోలాల్లోకి పోవడానికి దారి కలదు. 136 సర్వేనెంబర్ రైతు దడిగే మల్లయ్య తండ్రి నరసయ్య ఈ నక్ష బాటను ఆక్రమించి కడిలు పాతి, జాలి వేసినాడు, ఇలా చేయడం వల్ల 15 మంది రైతులకు దారి లేక వ్యవసాయం చేయలేకపోతున్నారు. గతంలో ఎస్సై, సిఐ, తాసిల్దార్లకు మా సమస్యను తెలియజేసిన పరిష్కారం కాలేదు అన్నారు. మేము రైతుల మందిరం వ్యవసాయం మీదనే జీవనం సాగిస్తున్నాము, కాబట్టి నక్షబాటను ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకుని 15 మంది రైతు కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము అని తెలిపారు.
Spread the love