– గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడలోగల సాయి ఐశ్వర్య కాలనీ వాసు ల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులు కలిసితో పర్యటించి ఎక్కడ ఉన్నా సమస్యలు అడిగి తెలుసుకునీ నెలకొన్న సమస్యలపై సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొ రేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తమ కాలనీలో భూగర్భడ్రయినేజీ, మంచినీటి సరఫరా పూర్తయిన ప్రాంతాల్లో సీసీ రోడ్డులు రోడ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డినీ కోరారు. దీంతో అక్కడే ఉన్న అధికారులకు ఆయా సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని అయన ఆదేశించారు. స్థానికంగా ఉన్న మురుగు నీటి కాలువ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుం దని, సరైన చర్యలు తీసుకోకపోవటం, శుభ్రం చెయ్యకపో వటం వల్ల తరచూ అనారోగ్య పాలుకావాల్సి వస్తోందని కాలనీ వాసులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకు ని రాగా తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు. వెంటనే తగు చర్యలు తీసుకోని, మురుగు కాలు వ పనులు చేపడాతమని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. అనంతరం తమ కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గచ్చిబౌలి డివిజన్ కార్పొరోటర్ గంగాధర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే దిశగా పని చేస్తున్నామన్నారు. పక్కా ప్రణాళికతో భవిష్యత్తులో జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపా యాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. పెరుగుతున్న జనాభా దృశ్య డ్రెయినేజీ పైప్లైన్ డయా పెంచి లెవల్స్ తో అనుసంధానం చేస్తూ ఒక్క కాలనీ నుండి మరొక కాలనీకి మధ్యన ఇబ్బందులు తల్లెత్తకుండ పనులు ప్రణా ళిక బద్దంగా అన్ని కాలనీలకు దశలవారీగా మౌలిక వస తుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్న తన దష్టికి తీసుకోని రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీి, డీఈ విశాలాక్షి, ఏఈ జగదీష్, సాయి ఐశ్వర్య రెసిడెంట్స్ వెల్ఫేర్ అస్సోసి షన్ కమిటీ సభ్యులు, ప్రభాకర్, అమిత్ భరద్వాజ్, భాగ్య లక్ష్మి, నర్సింహా మూర్తి, అశోక్ రాజు,రమణి రామ చంద్ర రావు,విజయ కుమార్,రమణి, సాయి ఐశ్వర్య కాలనీ వాసులు రామ్ చందర్ రావు చిట్టి బాబు మహేష్, ఈశ్వర్, శ్రీధర్, విజరు, సతీష్ చంద్ర మురళి, అతుల్, మనీష్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు శివసింగ్, తిరుపతి సీనియర్ నాయకులు, సుధాకర్ రాజేష్, అరుణ్ కృష్ణ బన్నీ, కిశోరె ఈశ్వరయ్య, సతీష్ నర్సింగ్ నాయక్, స్థానిక నేతలు, సాయి ఐశ్వర్య కాలనీ వాసులు, సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.