మండలంలోని నార్లాపూర్, మేడారం గ్రామాలలో ఏర్పాటు చేసిన నర్సరీలను గురువారం అదనపు కలెక్టర్ శ్రీజ, ఎంపీడీవో తో కలిసి సందర్శించి, పరిశీలించారు. అనంతరం నర్సరీలో పర్యటించి మొక్కల పెరుగుదలకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీవో సుమన వాణి, ఎంపీఓ శ్రీధర్ రావు, మేడారం పంచాయతీ కార్యదర్శులు కొర్నేబెల్లి సత్తీష్, అజ్మీర ధర్మేందర్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.