నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ సబ్ డివిజన్ నూతన అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన యువ ఫౌండేషన్ అభ్యర్థులు గురువారం వేములవాడ సబ్ డివిజన్ కి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్. శేషాద్రిని రెడ్డి ని యువ ఫౌండేషన్ అభ్యర్థులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా ఫౌండేషన్ వ్యవస్థాకుడు కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ గౌడ్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి, పోలీస్ , ఆర్మీ అభ్యర్థుల కు ఇచ్చే ఉచిత ఫిజికల్ శిక్షణ గురించి అడిషల్ ఎస్పీ కి వివరించారు. ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ అభ్యర్థులు పలు సూచనలు ఇస్తూ క్రమశిక్షణతో ఇష్టపడి కష్టపడితే విజయం మీదే.. ఉన్నత లక్ష్యం దిశగా వెళ్ళుటకు అనుకున్న లక్ష్యం చేరుటకు కష్టపడాలి అని అన్నారు. కష్ట పడితే విజయం కచ్చితంగా దక్కుతుందిఅని, ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమలకు అభినందించారు. ఈ కార్యక్రమం లో ఫౌండేషన్ అభ్యర్థులు పద్మ, స్వాతి, లావణ్య, వినయ్, సాయి కృష్ణ, రామ్ కుమార్, మహేష్,సంతోష్, రాకేష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.