విద్యుత్ ప్రజావాణి సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఏడిఈ పాపిరెడ్డి

నవతెలంగాణ – నెల్లికుదురు 
విద్యుత్ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన లక్ష్యంగా ముందుకు సాగుదామని విద్యుత్తు ఏడిఈ పాపిరెడ్డి ఏఈ సింధు, భార్గవి అన్నారు. మండల కేంద్రంలోని  ప్రజావాణి కార్యక్రమాన్ని సబ్ ఇంజనీర్ హరీష్ తో కలిసి సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ పై అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని నెల్లికుదురు ఏ డి ఈ కార్యాలయంలో మునిగల వీడు, దంతాలపల్లి, సబ్ స్టేషన్ లో ప్రతి సోమవారం విద్యుత్తు సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ప్రజావాణి అనే కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఇట్టి ప్రజావాణి కార్యక్రమంలో నెల్లికుదురు ఆరు దరఖాస్తులు మునగలవేడు సబ్ స్టేషన్ లో నాలుగు దరఖాస్తులు వచ్చాయి అని అన్నారు. అందులో ఒకటి పోలు విరిగిపోయిందని దరఖాస్తు వచ్చిందని అన్నారు. ఇంకొకటి ట్రాన్స్ఫార్మర్ ఒక చోట నుండి మరొక చోటికి మార్చాలని దరఖాస్తులు తీసుకొని కన్జ్యూమర్లు ఆఫీస్ వద్దకు వచ్చారని  తెలిపారు. ఇందులో వెంటనే అధికారుల స్పందించి విరిగిపోయిన పోలును తొలగించి నూతనంగా కొత్త పోలును నాటించడం జరిగిందని అన్నారు. త్వరలోనే ట్రాన్స్ఫార్మర్ కూడా మారుస్తామని ఈ సందర్భంగా తెలిపారు. విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని కంజుమర్లు సద్వినియోగం చేసుకున్నందుకు కృతజ్ఞతలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు కన్జ్యూమర్లు పాల్గొన్నారు.
Spread the love