ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన అద్వానీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : బీజేపీ వృద్ధ నేత ఎల్కే అద్వానీ (96) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జి అయ్యారు. నిన్న అద్వానీ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అద్వానీ ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ వైద్యుల బృందం నిశితంగా పరిశీలించింది. ముఖ్యంగా, మూత్ర సంబంధ వ్యాధుల నిపుణులు, హద్రోగ నిపుణులు, వృద్ధాప్య సంబంధ వ్యాధుల నిపుణులు అద్వానీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, ఆయన వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్టు ఎయిమ్స్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఈ సాయంత్రం ఆయనను డిశ్చార్జి చేశారు.

Spread the love