పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బండారం బయటపడుతుంది: ఎమ్మెల్యే

నవతెలంగాణ – భీంగల్
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల తర్వాత  బండారం బయటపడుతుందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.  సోమవారం పట్టణ కేంద్రంలోని మెరీడియన్ ఫంక్షన్ హాల్ లో పార్లమెంట్ ఎన్నికల  సన్నాహాక  సమావేశాన్ని  నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి,  బిఆర్ఎస్ పార్టీ  ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్  తగ్గిందని  అది పార్లమెంట్ ఎన్నికల తర్వాత బయట పడుతుందన్నారు. రానున్న  సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  నామరూపం లేకుండా పోతుందన్నారు అన్నారు. దొంగ హామీలను ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ఇక్కడి ప్రాంత ప్రజల సమస్యలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థికి తెలియమన్నారు.  అనంతరం రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి మాట్లాడుతూ..ఇక్కడి ప్రజల చిరకాల కోరక మే రకు పార్లమెంట్ లో ప్రయివేట్ బిల్లు  పెట్టానని దానికి మద్దతు కావాలంటే బాజీ రెడ్డి గోవర్థన్ లాంటి  వారు ఎంపీ కావాలని. అందుకు బాజిరెడ్డి గోవర్దన్ ను సంపూర్ణ మెజార్టీ తో  గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బాజారెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజలు, రైతులు కేసీఆర్ ను వదులుకొని బాధపడుతున్నారని రేవంత్ రెడ్డి జూట మాటలతో అన్ని వర్గాల ప్రజలను మోసం  చేశాడని,  అందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్దంగా  ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం లోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని కనుక పార్లమెంటులో కూడా మన ప్రాంత గళం వినిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కనుక టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు.  ఈ సమావేశంలో మండల బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love