– ఎల్‌సీజీటీఏ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ నిర్ణయాలను స్వాగతిస్తున్నామని లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్ల అసోసియేషన్ (ఎల్‌సీజీటీఏ) తెలిపింది. ఏకీకృత సర్వీసు నిబంధనలను వ్యతిరేకించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం వీరాచారి, ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మీకాంతరెడ్డి, గౌరవాధ్యక్షులు కె యాదగిరి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1992 నుంచి 2018 వరకు అన్ని ప్రభుత్వాలు ఉమ్మడి సర్వీసు నిబంధనలకు అనుకూలంగా జీవోలను తీసుకొచ్చాయనీ, వాటిని హైకోర్టు, సుప్రీంకోర్టు తిరస్కరించాయని గుర్తు చేశారు. ఉమ్మడి సర్వీసు నిబంధనలు రాజ్యాంగ ిరుద్ధమని స్పష్టమైన తీర్పును ఇచ్చాయని తెలిపారు. అయినా జేఏసీ అదే తీర్మానం చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులందరినీ జిల్లా పరిషత్ పరిపాలన పరిధిలోకి పంపించాలని డిమాండ్ చేశారు.