పీఏం కిసాన్ పథకానికి రైతులు వెంటనే ఈకేవైసీ చేసుకోవాలి: వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని చిన్నాపుర్, తిమ్మాపూర్ గ్రామాలలో రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి  ఈ కె వై సీ పై జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పీఎం కిసాన్  పథకంలో ఈ కే వై సీ చేసుకొని రైతులు, ఈకేవైసీ చేసుకుంటేనే మరో విడత డబ్బులు పడతాయని, కావున మిగిలిన రైతులు త్వరగా చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం మొక్కజొన్నలో వస్తున్న ఎండు తెగుల నివారణ చర్యలను, వరిలో కాండం తొలుచు పురుగు నివారణ సూచనలు రైతులకు వివరించటం జరిగింది. అదే విధంగా ఫెర్టిలైజర్ షాప్ లను తనిఖీ చేసి,  రికార్డ్స్ లను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్ , ఏ ఈ ఓ జ్యోష్న, షోయబ్ అహ్మద్ ,విఘ్నేష్, రైతులు పాల్గొన్నారు.
Spread the love