– ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత
నవతెలంగాణ కంఠేశ్వర్
ఐద్వా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నగరంలోని నాందేవాడలో ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత ఆధ్వర్యంలో బుధవారం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. అఖిల భారత ప్రజాస్వామిక మహిళా సంఘం 1981 నుంచి 2025 వరకు నిరంతరం ప్రజాస్వామ్యం, సమనత్వం, స్త్రీ విముక్తి కోసం మహిళలపై జరుగుతున్న హత్యలు, లైంగికదాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అఘాయిత్యాలపై ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. రానున్న రోజుల్లో కూడా మహిళల హక్కుల కోసం పోరాటాలు నిర్వహిస్తాం. మహిళలని చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు చేపడతామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనిత, నగర కార్యదర్శి వనజ, ఐద్వా నాయకులు కవిత, సంతోషి, శ్రావ్య, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.