డాక్టర్లకు, పోలీస్ సిబ్బందికి రాఖీలను కట్టిన ఐద్వా నాయకులు 

Aidwa leaders tied rakhis to doctors and police personnelనవతెలంగాణ – కంటేశ్వర్ 
రాఖీ పండుగ రోజు కూడా సొంత ప్రాంతాలకు వారి ఇండ్లలోకి వెళ్లకుండా కలకత్తాలో జరిగిన ఘటనపై నిరసన తెలుపుతున్న జూ.డాక్టర్లకు వారి నిరసనకు రక్షణ కల్పిస్తున్న పోలీస్ సిబ్బందికి ఐద్వా ఆధ్వర్యంలో స్వయంగా రాఖీలు తయారుచేసి వాటిపై సేవ్ ద సేవియర్  సేవ్ ద ఉమెన్  సేవ్ ద చిల్డ్రన్స్  అని రాసి డాక్టర్లకు పోలీస్ సిబ్బందికి కట్టడం జరిగింది.  ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. మనమంతా కులము, మతము ప్రాంతీయ అనే తేడాలు లేకుండా అన్నా చెల్లెళ్ల లాగా అక్క తమ్ముడు లాగా కలిసి అందరం కలిసే బతుకుదాం మనదేశంలో ఏ ఆడపిల్లకు ఎక్కడ ఏం జరిగినా కలిసికట్టుగా పోరాడుదాం అని అందుకు ఐద్వా ఎప్పుడు ముందు ఉంటుందని తెలిపారు. నిరంతరం ప్రజల్ని మహిళల్ని మేలుకొంపే అందుకు ఎప్పటికప్పుడు వస్తున్న సమస్యలపై ఆందోళన విషయంలో ముందుంటుందని రేపు కలకత్తాలో జరిగిన అమ్మాయి విషయంలో న్యాయం జరగకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు ఉదృతం చేస్తామని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలుఅనిత, కే లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love